మంథనిలో బలవీర హనుమాన్ దేవాలయాన్ని దర్శించుకున్న సీనియర్ సివిల్ కోర్ట్ జడ్జి భవాని
03-09-2025 12:53 AM
మంథని సెప్టెంబర్ 2 (విజయక్రాంతి) మంథని మున్సిపల్ పరిధిలోని బోయిన్ పేట లోని అతి పురాతనమైన బలవీర హనుమాన్ దేవాలయాన్ని మంగళవారం మంథని సీనియర్ సివిల్ జడ్జి కోర్ట్ భవాని సందర్శించి, పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమెను తాజా మాజీ కౌన్సిలర్ నక్క నాగేంద్ర శంకర్ సన్మానించారు.






