సీఎం రేవంత్ సభకు కాంగ్రెస్ శ్రేణులు భారీగా తరలిరావాలి
03-09-2025 12:53 AM
మండల కాంగ్రెస్ అధ్యక్షులు నవీన్ పిలుపు
మణుగూరు, సెప్టెంబర్ 2 ( విజ య క్రాంతి) : నేడు జిల్లాలో జరిగే సీఎం రేవంత్ రెడ్డి పర్యటనలో పినపాక నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ శ్రే ణులు పెద్ద ఎత్తున తరలి రావాలని, మండల కాంగ్రెస్ అధ్యక్షులు పీరినా కి నవీన్ కోరారు. మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆయనవిలేకరులతో మాట్లాడారు.
నియోజకవర్గంలో సుమారు గా 50 వేల మందిని సీఎం సభకు తరలించేందుకు పలు ఏర్పాట్లు చేసామని తెలిపారు.ప్రతి గ్రామం నుండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, మహిళా, యువజ న విద్యార్థి సంఘాల బాధ్యులు సీఎం సభను విజయవంతం చేసేందుకు జనసమీకరణ చేపట్టాలనికోరారు.






