కాంగ్రెస్ సీనియర్ నేత అంతయ్య సేవలు మరువలేనివి..!!
డీసీసీ ఉపాధ్యక్షుడు దరూరి యోగానందచార్యులు
జాజిరెడ్డిగూడెం: కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్మకంటి అంతయ్య పార్టీకి చేసిన సేవలు,ప్రజాసేవలో ఆయన అందించిన సేవలు, నిజాయితీ, అంకితభావం చిరస్మరణీయమని డీసీసీ ఉపాధ్యక్షుడు,హైకోర్టు అడ్వకేట్ దరూరి యోగానందచార్యులు అన్నారు. సూర్యాపేట జిల్లా జాజిరెడ్డిగూడెం గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎల్మకంటి అంతయ్య హర్ట్ స్ట్రోక్ తో మరణించగా శనివారం ఆయన భౌతిక ఖాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను ఓదార్చారు.
అనంతరం ఆయన పార్టీ బలోపేతానికి చేసిన సేవలను కొనియాడారు. నివాళులర్పించిన వారిలో బ్లాక్ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు నర్సింగ శ్రీనివాస్ గౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మోరపాక సత్యం, యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శిగ నసీర్ గౌడ్, సర్పంచ్ బింగి కృష్ణమూర్తి, కాంగ్రెస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు నర్సింగ కృష్ణమూర్తి, వార్డు సభ్యులు ప్రవీణ్, ఖాజ, వేణుగోపాల్, సైదులు, నరేష్, సీనియర్ నాయకులు జేరిపోతుల సోమయ్య, ఎల్లెంల కొమురెల్లి, డాక్టర్ లక్ష్మణ్, శ్రీనివాస్, బాబురావు తదితరులు ఉన్నారు.




