28 February, 2026 | 7:56 PM

సైన్స్‌పై ఆసక్తి పెంచుకోవాలి

28-02-2026 05:55 PM

చిన్నకోడూర్ గుర్రాలగొందిలో జాతీయ సైన్స్ దినోత్సవం

సిద్దిపేట రూరల్: టీజీఎస్‌డబ్ల్యూఆర్‌ఎస్/జెసి(బాయ్స్) చిన్నకోడూర్, గుర్రాలగొంది పాఠశాలలో జాతీయ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి పాఠశాల ప్రిన్సిపాల్ ఎ. దుర్గా రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఏర్పాటు చేసిన సైన్స్ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించి వివిధ శాస్త్రీయ నమూనాలను పరిశీలించారు. విద్యార్థులు రూపొందించిన సృజనాత్మక ప్రాజెక్టులు, ఆవిష్కరణలు, శాస్త్రీయ ప్రయోగాలు ఆకట్టుకున్నాయి.

సైన్స్ ఉపాధ్యాయులు శాస్త్రవేత్తల సేవలను స్మరించుకుంటూ శాస్త్ర విజ్ఞానం దైనందిన జీవితంలో ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు ఆలపించిన సైన్స్ గీతం కార్యక్రమానికి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థులు శాస్త్రీయ దృక్పథాన్ని అలవర్చుకుని సృజనాత్మకతను పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు.