15 April, 2026 | 3:16 AM

కాంగ్రెస్ సీనియర్ నేత మృతి

15-04-2026 12:00 AM

లక్ష్మణ చాంద, ఏప్రిల్ ౧౪ (విజయక్రాంతి): మామడ మండలం న్యూ సాంగ్వి గ్రామానికి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత ఏనుగు లింగారెడ్డి మంగళవారం గుండెపోటుతో మృతి చెందారు. నిర్మల్ మార్కెట్ కమిటీ చైర్మన్, నిర్మల్ నియోజకవర్గ బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షునిగా, మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షులు దివంగత నర్సారెడ్డి, అనుచరుడుగా, కాంగ్రెస్ పార్టీలో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

ఆయనకు నెల రోజుల క్రితం ఉండే ఆపరేషన్ కాగా మళ్లీ నొప్పి రావడంతో హైదరాబాద్ తరలించారు, అక్కడ చికిత్స పొందుతున్న లింగారెడ్డి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి పట్ల డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడుమ బుజ్జి పటేల్ మాజీ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీహరి రావు, ముధోల్ మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు అప్పల గణేష్ చక్రవర్తి. పార్టీ సీనియర్ నేతలు రఘునందన్ రెడ్డి తదితరులు సంతాపం తెసిపారు. అంత్యక్రియలు బుధవారం న్యూ సాంగ్విలో నిర్వహిస్తారు.