12-02-2026 05:49:00 PM
మేడ్చల్ అర్బన్,(విజయక్రాంతి): అనారోగ్యంతో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ రోండ మల్లారెడ్డి మృతి చెందారు. గురువారం ఉదయాన్నే అనారోగ్యంతో బాధపడుతున్న కాంగ్రెస్ పార్టీ నాయకులు మల్లారెడ్డి మృతి చెందినట్లు స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ఈ నేపథ్యంలో మేడ్చల్ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న గారి లక్ష్మారెడ్డి కోడూరు గ్రామంలోని కీర్తి శేషులు రెండవ మల్లారెడ్డి పార్థీవ దేహంపై పూల మాల వేసి శ్రద్ధాంజలి ఘటించినట్టు తెలిపారు.
ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే కేఎల్ఆర్ మాట్లాడుతూ కీర్తి శేషులు డాక్టర్ రొండ మల్లారెడ్డి నాకు చాలా సన్నిహిత మిత్రుడు అతని మృతి చాలా బాధాకరమని ఆయన తెలిపారు. పూడూరు గ్రామంలోని మల్లారెడ్డి నివాసానికి వెళ్లిన మాజీ ఎమ్మెల్యే కెల్లార్ మల్లారెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండండి ఏదైనా నేను మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.