calender_icon.png 9 February, 2026 | 2:05 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్రిలింగేశ్వర ఆలయాన్ని సందర్శించిన హైకోర్టు సీనియర్ అడ్వకేట్

09-02-2026 12:46:57 PM

నాగిరెడ్డిపేట్,(విజయక్రాంతి): మండలంలోని తాండూరు గ్రామంలో గల త్రిలింగేశ్వర ఆలయాన్ని హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పామిడి గంటం రఘురాం కుటుంబ సభ్యులతో కలిసి సందర్శించుకుని శివునికి ప్రత్యేక పూజలు అభిషేకం చేసి దేవాలయం చరిత్రను ఆలయ కమిటీ సభ్యులతో అడిగి తెలుసుకున్నారు. 1000 సంవత్సరాల అద్భుతమైన చరిత్ర కలిగిన త్రిలింగేశ్వర దేవాలయం పునర్జీవనం కోసం పాటుపడిన దేవాలయ కమిటీ సభ్యులకు గ్రామస్తులకు పరిసర గ్రామాల ప్రజలకు ప్రత్యేక అభినందనలు తెలియజేశారు.

త్రిలింగేశ్వర దేవాలయం అభివృద్ధి నిమిత్తం కొరకు తనవంతు భాగంగా 70 వేల,, నగదును హైకోర్టు సీనియర్ అడ్వకేట్ పామిడి గంటం రఘురాం ఆలయ కమిటీసభ్యులకు అందజేశారు.ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు దత్తు,తాండూర్ అక్కంపల్లి,వెంకంపల్లి, మాటూర్ గ్రామాల సర్పంచులు యాదవ్ గౌడ్,వెంకా గౌడ్,జ్యోతి సురేందర్ రెడ్డి,బెస్త భాగ్య సతీష్ ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.