22 June, 2026 | 3:19 PM

Breaking News

బయోలాజికల్, పీఈటి పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం   •   ఉడుత శంకర్ యాదవ్ తండ్రిని పరామర్శించిన కనీస వేతనాల చైర్మన్ జనక్ ప్రసాద్   •   SIR ప్రక్రియలో తప్పొప్పులకు తావివ్వకండి   •   దుందుభి వాగుపై హై లెవెల్ బ్రిడ్జికి మంత్రి సీతక్క శంకుస్థాపన   •   డీటీవో వెంకన్న మృతి ఘటనపై విచారణకు ఆదేశం   •   బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా.. పదేళ్లలో ఆరుగురు!   •   ఉప సర్పంచుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా..   •   శిక్షణా తరగతులు కార్మిక చైతన్యానికి దోహదపడాలి   •   ​ ప్రజా పాలన సినిమా కాదు.. ప్రతిపక్ష పాత్ర సరిగ్గా పోషించండి: మంత్రి సీతక్క   •   డీటీవో వెంకన్న మృతి పట్ల రేవంత్ రెడ్డి దిగ్బ్రాంతి   •  

యాప్ ల పేరుతో రైతుల హరిగోస

09-02-2026 12:49 PM

రైతులకు సరిపడా యూరియా సరఫరా చేయాలి

టిడిపి మండల పార్టీ అధ్యక్షులు కీసరి నాగయ్య

గరిడేపల్లి,(విజయ క్రాంతి): యాప్ ల పేరుతో రైతులు హరిగోస పడుతున్నారని,రైతులను ఇబ్బందులు పెట్టడం సరైంది కాదని టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు కీసరి నాగయ్య అన్నారు.ఆదివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ యాప్ ల పేరుతో రైతులను ఇబ్బందులుపెట్టడం సరైంది కాదన్నారు. ప్రతి రైతు వద్ద స్మార్ట్ ఫోన్లు లేవని,ఉన్న వారికి నెట్ సౌకర్యం లేదన్నారు. యాప్ ను డౌన్లోడ్ చేసుకోవడం,బుకింగ్ చేసుకోవడం,ఓటిపి చెప్పే విధానం రైతులందరికీ తెలియదు అన్నారు.

ప్రభుత్వం వెంటనే యాప్ విధానం రద్దు చేసి అన్ని పర్టీ లైజర్ షాపులకు సరిపడ యూరియా అందించాలన్నారు.యూరియా కొరకు రైతులు చలిలో నిల్చుని పడిగాపులు కాయడం ప్రభుత్వ చేతకాని తనం అన్నారు.నాన్ ఆయకట్టు ఏరియాలో యూరియా మెండుగా ఉండి,ఆయకట్టు ఏరియాలో యూరియా సరిపోను లేకపోవడం దారుణమన్నారు.బుక్ చేసుకున్నవారు దూర ప్రాంతాలకు వెళ్లి యూరియా తెచ్చుకోవడం రైతులు ఇబ్బందులు పడుతున్నారని,

ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి యాప్ విధానాన్ని రద్దు చేసి రైతులకు సరిపడా యూరియా అందించాలని ఆయన డిమాండ్ చేశారు.యూరియా విషయంలో రైతులు పడుతున్న ఇబ్బందులను పరిష్కరించాలని లేనియడల రైతు ల పక్షాన తహసిల్దార్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహిస్తామని తెలిపారు.ఆయన వెంట షేక్ మస్తాన్,పాతకోటి లింగారెడ్డి,పశ్య సీతారాంరెడ్డి,మీరా,పాండు, మామిడి వెంకటేశ్వర్లు,తదితరులు ఉన్నారు.