09-02-2026 12:44:15 PM
చౌపన్‌గూడ సర్పంచ్ డి. జైనుబాయి
వాంకిడి,(విజయక్రాంతి): ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే పనులను కూలీలు సద్వినియోగం చేసుకోవాలని చౌపన్‌గూడ గ్రామ సర్పంచ్ డి. జైనుబాయి సూచించారు. సోమవారం గ్రామంలో నూతనంగా ప్రారంభించిన ఉపాధి హామీ పనులను పాలకవర్గ సభ్యులతో కలిసి ఆమె ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్రలు చేస్తోందని, దీనికి వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం పోరాటం చేస్తోందని అన్నారు. గ్రామీణ పేదలకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా ఈ పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సీడం అన్నిగా, గ్రామ ఉపసర్పంచ్, ఫీల్డ్ అసిస్టెంట్, ఉపాధి హామీ కూలీలు తదితరులు పాల్గొన్నారు.