calender_icon.png 18 September, 2025 | 2:41 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సెప్టెంబర్-17 తెలంగాణకు ముమ్మాటికీ విద్రోహమే..

18-09-2025 12:49:14 AM

ఆలేరు, సెప్టెంబర్ 17 (విజయ క్రాంతి):  తెలంగాణ సమాజానికి ద్రోహం చేసిన సెప్టెంబర్ 17 ముమ్మాటికి తెలంగాణకు ఈ ప్రాంత ప్రజలకు విద్రోహ దినమని సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకులు కళ్లెపు అడివయ్య, మామిడాల సోమయ్య అన్నారు, సెప్టెంబర్ 17 విద్రోహ దినం సందర్భంగా యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కేంద్రంలోని న్యూడెమోక్రసీ కార్యాలయంలో జరిగిన కార్యక్రమానికి హాజరైన అడివయ్య, సోమయ్యలు మాట్లాడుతూ నైజాంకు వ్యతిరేక సాయుధ పోరాటం

బ్రిటిష్ పాలనలోనే భారత దేశంలో 500 పైగా ఫ్యూడల్ సంస్థానాలు కొనసాగుతున్నాయని, అందులో ఒకటి నిజాం పాలకుడుగా హైదరాబాద్ సంస్థానం ఉందని, నిజాం నిరంకుశత్వానికి ఫ్యూడల్ దోపిడీకి వ్యతిరేకంగా భారత కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో 1946 నుండి 1951 వరకు తెలంగాణ సాయుధ పోరాటం కొనసాగిందని, దోపిడికి అణచివేతకు వివక్షకు గురి అవుతున్న శ్రామిక ప్రజలు దున్నేవానికి భూమి నినాదంగా భూమి భుక్తి విముక్తి కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో గొప్ప పోరాట ఐక్యత ప్రదర్శించినారనీ, తెలంగాణ నిరంకుశ ఫ్యూడల్ పాలకుడైన నైజాముకు వ్యతిరేకంగా, నిజాంకు దళారిలైన  అగ్రకుల భూస్వాముల అధిపత్యాన్ని కూల్చివేస్తూ తెలంగాణ రైతాంగం 3000 గ్రామ రాజ్యాలు స్థాపించినారు. ఈ కార్యక్రమంలో అఖిలభారత రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి బేజాడి కుమార్, ఇఫ్టు జిల్లా అధ్యక్షులు పద్మ సుదర్శన్, పార్టీ నాయకులు మామిడాల బాల మల్లేష్, పి.వై.ఎల్. జిల్లా అధ్యక్షులు మారుజోడు సిద్దేశ్వర్, ఆర్ ఉదయ్, కళ్లెపు నిశాంత్, సుంచు రాములు, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.