calender_icon.png 18 September, 2025 | 2:37 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పెద్దపల్లి నియోజకవర్గలో హై లెవల్ బ్రిడ్జి పనులకు 5 కోట్లు మంజూరు

18-09-2025 12:50:02 AM

పెద్దపల్లి, సెప్టెంబర్17(విజయ క్రాంతి) నియోజవర్గంలోని కాల్వ శ్రీరాంపూర్, జూలపల్లి, ఎలిగేడు, సుల్తానాబాద్, పెద్దపల్లి మండలాలలో నూతన రోడ్ల నిర్మాణాలకు పంచాయతీ రాజ్ శాఖ ద్వారా రూ. 5 కోట్లు హై లెవల్ బ్రిడ్జి లు మంజూరు చేయించామని పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణ రావు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.

పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకురావడానికి అహర్నిశలు కష్టపడుతున్నామని, కాంగ్రెస్ సర్కార్ తోనే అభివృద్ధి సాధ్యం అని కాంగ్రెస్ అంటేనే అభివృద్ధి, సంక్షేమం అని గుర్తుచేశారు. జిల్లా కేంద్రానికి సులభంగా ప్రయాణం చేయడానికి రహదారుల, హై లెవల్ బ్రిడ్జి నూతన నిర్మాణాలు చేపట్టడం జరుగుతుందని, గ్రామాల నుండి మండలాలకు అలాగే మండలాల నుండి జిల్లా కేంద్రానికి సులభంగా ప్రయాణం చేయడానికి గొప్ప ప్రణాళికలు రూపొందించి,

ఆ రోడ్డు మార్గాలను అభివృద్ధి చేయడం జరుగుతుందని, గత పాలకులు చేసిన తప్పిదాలను చేయకుండా వాటిని పునరావృతం చేయకుండా పటిష్టమైన చర్యలు చేపడుతున్నారు. పెద్దపల్లి నియోజకవర్గానికి తాను ఎమ్మెల్యేగా ఉన్నంత కాలం నిధులు మంజూరు విషయంలో రాజీ పడేది లేదని, మన రోడ్లను మనమే పరిశుభ్రంగా ఉంచుకోవాలని ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు.

రూ. 5 కోట్లు పెద్దపల్లి నియోజకవర్గానికి మంజూరు చేసినందుకు సీఎం రేవంత్ రెడ్డికి, పంచాయతీ రాజ్ శాఖ మంత్రి సీతక్క కు జిల్లా మంత్రి శ్రీధర్ బాబుకు ఎమ్మెల్యే కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.