calender_icon.png 7 February, 2026 | 1:19 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సేవే లక్ష్యం.. అభివృద్ధే ధ్యేయం..

07-02-2026 12:10:24 AM

చేవెళ్ల, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మున్సిపల్ ఎన్నికల వేళ చేవెళ్ల 15వ వార్డు రాజకీయాలు వేడెక్కాయి. కాంగ్రెస్ పార్టీ తరపున కౌన్సిలర్ అభ్యర్థిగా బరిలో ఉన్న మాజీ సర్పంచ్ బండారి శైలజ ఆగిరెడ్డి తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. ‘మీ నమ్మకాన్ని వమ్ము చేయను.. సేవ చేయడానికి మరో అవకాశం ఇవ్వండి‘ అంటూ ఆమె ఓటర్లను అభ్యర్థిస్తున్నారు.

సర్పంచ్గా పనిచేసిన కాలంలోనే ఎమ్మెల్యే కాలే యాదయ్య, ఎంపీ రంజిత్ రెడ్డిల సహకారంతో చేవెళ్ల రూపురేఖలు మార్చామని ఆమె గుర్తుచేశారు.  గ్రామంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, సిసి రోడ్లు, వీధి దీపాలు మరియు మంచినీటి సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు.HMౄA నిధులు రూ. 15 కోట్లతో ఇప్పటికే అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.

రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలను (ఉచిత బస్సు ప్రయాణం, రూ. 500 గ్యాస్ సిలిండర్, ఇందిరమ్మ ఇండ్లు, రైతు భరోసా, ఆరోగ్య భీమా) ఇంటింటికీ చేరవేస్తానని శైలజ హామీ ఇచ్చారు. చేవెళ్ల మున్సిపాలిటీని రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలపడమే తన లక్ష్యమని వెల్లడించారు.రైతు కుటుంబ నేపథ్యం, ప్రజలతో ఉన్న అవినాభావ సంబంధాలే తనను గెలిపిస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రచారంలో భాగంగా ఆమెకు వార్డు ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోంది. ‘హస్తం‘ గుర్తుకు ఓటు వేసి, అభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆమె కోరారు.