calender_icon.png 7 February, 2026 | 11:43 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మేడారం హుండీ ఆదాయం 3.54 కోట్లు

07-02-2026 12:10:31 AM

రెండోరోజుల్లో 285 హుండీల లెక్కింపు 

మేడారం, ఫిబ్రవరి 6 (విజయక్రాంతి): మేడారం మహా జాతర హుండీల లెక్కింలో రెండోరోజు 3,54, 25,200 సమకూరినట్టు ఈవో తెలిపారు. శుక్రవారం హనుమకొండలోని టీటీడీ కల్యాణ మండపంలో 160 హుండీలను తెరిచి లెక్కించారు. ఇందులో రూ.63,436 విలువైన విదేశీ కరెన్సీ హుండీలో లభించినట్టు తెలిపారు. రెండు రోజుల్లో మొత్తం 6,04,53,636 రూపాయలు వచ్చిట్టు అధికారులు వెల్లడించారు. మొత్తంగా 828 హుండీలను మేడారం జాతరలో ఏర్పాటు చేయ గా, ఇప్పటివరకు 285 హుండీలను లెక్కించారు.