15 April, 2026 | 5:03 PM

ఆదివాసీల అభివృద్ధే లక్ష్యంగా సేవా కార్యక్రమాలు

14-04-2026 01:34 AM
  1. ఆదివాసీ గూడల్లో రాష్ట్ర డీజీపీ పర్యటన
  2. ఆదివాసులతో కలిసి సహపంక్తి భోజనం చేసిన డీజీపీ
  3. సర్పంచులతో సమావేశంలో రోడ్డు భద్రత గంజాయి నిర్మూలనపై సమీక్ష

ఉట్నూర్, ఏప్రిల్ 13 (విజయక్రాంతి): మారుమూల ఆదివాసి గ్రామాల అభివృద్ధి, ప్రజల ఆరోగ్య పరిరక్షణ లక్ష్యంగా జిల్లా పోలీ సు శాఖ ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమా లు  చేపట్టుతున్నామని రాష్ట్ర డిజిపి  శివధర్ రెడ్డి  అన్నారు. సోమవారం  పోలీస్ శాఖ ద్వారా ఏర్పాటు చేసిన   ఉట్నూర్ మండలం నర్సాపూర్ (జె) గ్రామంలో రాష్ట్ర డీజీపీ చేతు ల మీదుగా తాగునీటి ఆరో ప్లాంట్ను ప్రారంభించారు.

ఈ ప్లాంట్ ద్వారా గ్రామంలోని ఆదివాసి ప్రజలకు శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి రావడం వల్ల వారి ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడే అవకాశం ఉందని డీజీపీ అన్నారు. కలుషిత నీటితో సతమతమవుతున్న ఆదివాసీలకు ఆపద్బాంధవుడులా ఆదిలాబాద్ జిల్లా పోలీసులు ఆదుకొని ఆర్.వో ప్లాంట్‌ను  అందజేయడం జరిగిందన్నారు.

అదేవిధంగా గుడిహత్నూర్ మండల కేంద్రంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న సర్పంచులు, సుమారు 500 మంది రోడ్ సేఫ్టీ క్లబ్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. దీనికి జిల్లా కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ లతో కలిసి రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు... అరైవ్ అలైవ్ కార్యక్రమం ద్వారా ప్రజలు రోడ్డు భద్రతా నియమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని డీజీపీ సూచించారు.

అటు ఆదిలాబాద్ రూరల్ మండలం చించు ఘాట్ గ్రామంలో నిర్వహించిన ఆదివాసీల ప్రత్యేక కార్యక్రమం లో రాష్ట్ర డిజిపి శివధర్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.  మొదటగా సాంప్రదాయ డప్పు, వాయిద్యాల నడుమ రాష్ట్ర డిజిపి, పోలీసు అధికారులను ఘన స్వాగతం పలికిన ఆదివాసీలు, కులదైవం వద్ద పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు సురేందర్ రావు, మౌనిక, శిక్షణ ఐపిఎస్ రాహుల్ కాంత్, డిఎస్పీఎల్ జీవన్‌రెడ్డి, పట్టణ సీఐలు,ఎస్‌ఐలు, రిజర్వు సిబ్బంది పాల్గొన్నారు.