వెల్‌లెస్ సెంటర్‌లో సేవలు
16-05-2025 12:00 AM
హనుమకొండలోని మెటర్నిటీ ఆసుపత్రి పరిధిలోని వెల్ లెస్ సెంటర్‌లో విశ్రాంత ఉద్యోగులు, పాత్రికేయులకు సక్రమంగా సేవలు అందడం లేదు. ఈ సెంటర్‌కు వరంగల్, హనుమకొండ జిల్లాల నుంచే కాక భూపాలపల్లి, జనగాం, మహబూబ్‌నగర్ నుంచి కూడా వైద్యసేవల కోసం వస్తారు.
ఇక్కడ దీర్ఘకాలిక వ్యాధులకు చికిత్స అందించేందుకు వైద్యనిపుణులు అందుబాటులో లేరు. నాణ్యమైన మెడిసిన్ సైతం అందడం లేదు. వైద్యారోగ్యశాఖ ఇప్పటికైనా స్పందించి వెల్‌నెస్ సెంటర్‌లో సరైన వసతులు కల్పించాలని, అవసరమైన వైద్యనిపుణులను నియమించాలి. సెంటర్‌కు వచ్చే వారికి మౌలిక వసతులు కల్పించాలి.
కామిడి సతీశ్‌రెడ్డి, భూపాలపల్లి






