హింసకు గురవుతున్న మహిళలకు సఖీ సెంటర్ ద్వారా సేవలు
రంగంపల్లిలో సఖీ సెంటర్ ను ఆకస్మిక తనిఖీలో జిల్లా కలెక్టర్
పెద్దపల్లి, ఏప్రిల్ 1(విజయ క్రాంతి) హింసకు గురవుతున్న మహిళలకు సఖీ సెంటర్ ద్వారా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష రంగంపల్లి లోని సఖీ సెంటర్ ను ఆకస్మికంగా తనిఖీ చేసిసఖి సెంటర్ లోనే రిజిస్టర్ లను కలెక్టర్ పరిశీలించారు. సఖి కేంద్రంలో కౌన్సిలింగ్ అందుకుంటున్న వివిధ జంటలను కలెక్టర్ సఖి సెంటర్ ద్వారా అందుతున్న సేవలు వివరాలు తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ హింసకు గురవుతున్న మహిళలకు సఖీ సెంటర్ ద్వారా రిలీఫ్ రావాలని, ఇటువంటి కేసుల పై ఆధిక శ్రద్ధ వహించాలని కలెక్టర్ సూచించారు. సఖీ సెంటర్ కు వచ్చిన మహిళల సమస్య పరిష్కారానికి కృషి చేసి వారిని రెగ్యులర్ గా ఫాలో అప్ చేయాలని,
సఖి సెంటర్ కు వచ్చే బాధితులకు అవసరమైన కౌన్సిలింగ్ అందించాలని, వివిధ కేసులలో అవసరమైన సందర్భంలో న్యాయ సలహా సైతం అందించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో విస్తృతంగా పర్యటిస్తూ సఖీ సెంటర్ ద్వారా అందించే సేవల గురించి ప్రచారం కల్పించి, సఖి సెంటర్ కు వచ్చే బాధితుల సంఖ్య పెంచాలన్నారు.ఈ పర్యటనలో జిల్లా కలెక్టర్ వెంట సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.




