14 June, 2026 | 12:18 PM

కొండంరాజుపల్లిలో ఐదు నెమళ్లు మృతి

14-06-2026 11:16 AM

నంగునూరు,(విజయక్రాంతి): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం కొండంరాజుపల్లి గ్రామ పరిధిలో విషాదం చోటుచేసుకుంది. గ్రామంలోని ఏనుగు రాళ్ల సమీపంలో ఐదు నెమళ్లు అనుమానాస్పద స్థితిలో మృత్యువాత పడ్డాయి. ఒకేచోట ఐదు జాతీయ పక్షులు ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా కలకలం రేపింది. నెమళ్లు ఎలా చనిపోయాయనే దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.