17 April, 2026 | 3:23 AM

కూసుమంచి మండలంలో ఐదు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి

17-04-2026 12:00 AM

అధికారులకు వినతి చేసిన సీపీఎం నాయకులు

కూసుమంచి, ఏప్రిల్ 16 (విజయ క్రాంతి): కూసుమంచి మండలంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఐదు కేంద్రాలు ఏర్పాటు చేయాలని, మొక్కజొన్నల కౌలు రైతుల పంట ను ఎటువంటి ఆంక్షలు లేకుండా కాటాలు వేసి వారి అకౌంట్లో డబ్బులు వేయాలని,  ఎకరానికి 25 కింటాలు మాత్రమే కొంటామని నిబంధనను ఎత్తివేసి ప్రతి రైతు పండించిన ప్రతి గింజను పూర్తిగా 45 క్వింటాళ్ల వరకుకొనుగోలు చేసే బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలని తెలంగాణ రైతు సంఘం, సిపిఎం పార్టీ ప్రభుత్వాన్ని కోరారు.

గురువారం మండల కేంద్రం లో జరిగిన మండల స్థాయి ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో అధికారులకు వినతి చేశారు. మొక్కజొన్న పంట వేసి 5నెలలు అయింది, పంట నమోదు కార్యక్రమం జరిగి మూడు నెలలు అయింది, పంట వచ్చి నెల అయింది, అయినప్పటికీ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయటం గాని సరిపడా బస్తాలను ఏర్పాటు చేయటం కానీ ఇంతవరకు చేయలేదని ఆరోపించారు. 

ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ కూసుపంచి మండల కార్యదర్శి తోటకూర రాజశేఖర్ తెలంగాణ రైతు సంఘం మండల అధ్యక్ష కార్యదర్శులు యడవెల్లి రమణారెడ్డి, గిరిజన సంఘం డివిజన్ కార్యదర్శి మాడు గన్యా నాయక్, నాగేశ్వరరావు, మండల నాయకులు జువ్వాజి శీను ప్రసాద్ తదితరులు రైతు నాయకులు పాల్గొన్నారు.