17 April, 2026 | 3:23 AM

ఉద్రిక్తంగా విగ్రహాల తొలగింపు

17-04-2026 12:00 AM

ఆందోళన కారులను ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలింపు 

కుషాయిగూడ, ఏప్రిల్ 16 (విజయక్రాంతి): చర్లపల్లి డివిజన్ పరిధిలోని పెద్ద చర్లపల్లి చౌరస్తాలో మహానీయుల విగ్రహాలను తొలగించడంతో తీవ్ర ఉద్రిక్తత దారి తీసింది. పెద్ద చర్లపల్లిలో ఏర్పాటు చేసిన విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు తొలగించారని పేర్కొంటూ స్థానికులు, దళిత సంఘాల నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, పలు పార్టీలకు చెందిన నాయకులు తరలివచ్చి నిరసన తెలియజేస్తూ ఆందోళన చేపట్టారు.

దీంతో చర్లపల్లి ఇన్ స్పెక్టర్ సుధాకర్ ఆధ్వర్యంలో స్థానికంగా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బం దోబస్తు నిర్వహించారు. గురువారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు మహ నీయుల విగ్రహాలను తొలగించారని విషయం తెలిసి పెద్ద చర్లపల్లి చౌరస్తాలో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో విషయం తెలుసుకున్న బీఆర్‌ఎస్ రాష్ట్ర నాయకుడు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, బీఆర్‌ఎస్ డివిజన్ అధ్యక్షుడు వేమూరి మహేష్ గౌడ్, సిపిఎం జిల్లా కార్యదర్శి సత్యంతో పాటు పలు పార్టీలకు చెందిన సత్తిరెడ్డి, కడియాల జనార్ధన్,  కొమ్ము  నర్సింగరావు, రామచంద్ర గౌడ్, డప్పగిరి బాబు, కొమ్ము సురేష్, కెవిఎల్‌ఎన్ రావు, అనిల్ కుమార్, రమేష్, సురేష్‌లు స్థానికులతో కలిసి ఆందోళన చేపట్టారు.

దీంతో స్థానిక పోలీసులు ఆందోళన చేస్తున్న నాయకులు, దళిత సంఘాల నాయకులను అరెస్టు చేసి ఘట్కేసర్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విగ్రహా లు తొలగించిన వారిని గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రేటర్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్, మాజీ కార్పొరేటర్ బొంతు శ్రీదేవి, మంత్రి శ్రీధర్ బాబు కు నాయకులు సోమశేఖర్ రెడ్డి, మహేష్ గౌడ్, సత్తిరెడ్డి, జనార్దన్, గిరిబాబు, సురేషు, కేవీఎల్‌ఎన్ రావులు వినతి పత్రం అందజేశారు.