రాష్ట్ర ప్రభుత్వానికి ఎదురుదెబ్బ ఆ 40 ఎకరాలు ప్రైవేటుదే
పిటిషన్ దాఖలుకు ఇంత ఆలస్యమా?
లోతుకుంట స్థలం శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్‌దే: సుప్రీంకోర్టు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 15: కంటోన్మెంట్(Cantonment)లోని 40 ఎకరాల లోతుకుంట భూమి(Land) తమదేనంటూ తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు(Supreme Court) కొట్టివేసింది. ఈ వివాదాస్పద స్థలం(Disputed land) శాంతా శ్రీరామ్ కన్‌స్ట్రక్షన్(Shanta Sriram Constructions)దేనని గతంలో హైకోర్టు తీర్పునీయగా(High Court Verdict) తెలంగాణ ప్రభుత్వం దీన్ని సుప్రీంకోర్టు(Supreme Court)లో సవాల్ చేసింది. ఈ నేపథ్యంలో మంగళవారం ఈ పిటిషన్‌ను జస్టిస్ దీపాంకర్ దత్త(Justice Dipankar Datta) ధర్మాసనం విచారించి ఆసక్తికర వ్యాఖ్యలు చేస్తూ తీర్పునిచ్చింది. హైకోర్టు తీర్పునిచ్చిన తర్వాత 219 రోజులు ఆలస్యంగా పిటిషన్‌ను ఎందుకు దాఖలు చేశారని ప్రశ్నించింది.
ఈ కారణంతో పిటిషన్‌ను తిరస్కరిస్తున్నట్లు పేర్కొంది. అదేసమయంలో ఈ భూమి ప్రైవేటుదేనని, స్థలం ఆ సంస్థకే చెందుతుందని స్పష్టం చేసింది. ఇదే 40 ఎకరాల స్థలంపై హైకోర్టు తీర్పును ఉల్లంఘించి హైడ్రా గతంలో కూల్చివేతలు చేపట్టింది. ఈ నేపథ్యంలో కోర్టు పలుమార్లు అధికారుల తీరుపై తీవ్రంగా మండిపడుతూ, కోర్టు ధిక్కరణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. లోతుకుంట 40 ఎకరాల భూ వివాదంపై సదరు సంస్థ రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు వ్యవహరిస్తున్న తీరుపై గతంలో హైకోర్టును, ఇప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించగా ఈ తీర్పు వెలువడింది.