calender_icon.png 15 February, 2026 | 4:34 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు

15-02-2026 03:27:24 PM

మోతె,(విజయక్రాంతి): మండల పరిధిలోని గోపతండా గ్రామపంచాయతీలో ఆదివారం శ్రీ సద్గురు సేవాలాల్ మహారాజ్ జయంతిని గ్రామ సర్పంచ్ భూక్య బిక్కు,ఆలయ కమిటీ చైర్మన్ గుగులోతు (కిట్టు) రామోజీ ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. అనంతరం వారు మాట్లాడుతూ... 1739 ఫిబ్రవరి 15న అనంతపురం జిల్లా గుత్తి మండలంలోని రాంజీనాయక్ తండాలో జన్మించారు. సేవాలాల్. తండ్రి భీమానాయక్, తల్లి ధర్మిణి బాయి సేవాలాల్ పశువులను మేపడానికి వెళ్లే వారు. తల్లి తనకిచ్చిన చద్దిని ఆకలితో ఉన్నవారికి పెట్టి, అడవిలో దొరికే బంకమట్టితో రొట్టెలు చేసి తినేవారని అన్నారు.

ఈ విచిత్ర ప్రవర్తన తల్లితండ్రులకు, తండాలోని ప్రజలకు ఆశ్చర్యం కలిగించేది. ఆకలితో ఉన్నవాడికి అన్నం, దాహంతో ఉన్నవాడికి మంచి నీళ్ళు ఇవ్వాలని, దారి తప్పిపోయి ఆగమవుతున్న వారికి మంచి మార్గం చూపించాలని, సహాయం కోరిన వారికి అండగా ఉండాలని, ఏడుస్తూ కూర్చుంటే ఉన్నతులు కాలేరని... ఎన్నో జీవిత సత్యాలను తెలియజేశారు. క్షణంలోనే మన మాటలు ఏ ఖండాంతరాలకైనా చేరిపోతాయని, నీళ్ళను సైతం డబ్బుతో కొనాల్సిన రోజు వస్తుందని, ఎడ్లు లేకుండానే బండ్లు నడుస్తాయని. ఆయన మహిమలపై అనేక కథనాలున్నాయి. బంజారాల ఆరాధ్యదైవమైన సేవాలాల్ మహరాజ్ జీవితం యావత్ సమాజానికి ఆదర్శప్రాయం.

గోర్బోలి భాషను రాజ్యాంగంలోని ఎనిమిదవ షెడ్యూల్లో చేర్చాలి, సేవాలాల్ విగ్రహాన్ని పార్లమెంట్లో ప్రతిష్ఠించాలి. ఆయన చరిత్రను పాఠ్యపుస్తకాల్లో చేర్చాలి. సేవాలాల్ జయంతి రోజైన ఫిబ్రవరి 15ను సెలవు దినంగా ప్రకటించి, జయంతి ఉత్సవాలు నిర్వహించాలని బంజారాలు కోరుతున్నారని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ మాలోతు ఈశ్వరి రవి, డీలర్ గుగులోతు సీతారాములు, మాజీ ఎంపిటిసి శ్రీరాములు, వార్డ్ మెంబర్ లు పెరుగు లలిత రమేష్, కోర్ర లక్పతి, అశ్విని రామోజీ, బాసు, రాములు (యాపీ), గ్రామ యూత్ అధ్యక్షుడు భగవాన్, వినోద్, నవీన్, మోహన్ అశోక్, కోటి,బి.నాగు, గ్రామ బంజారా నాయకులు  పాల్గొన్నారు.