30 June, 2026 | 12:18 AM

నూతన వధూవరులు సహా ఏడుగురు మృతి

17-11-2024 02:13 AM

యూపీలో విషాదం

లక్నో, నవంబర్ 16: ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. వివాహ వేడుక అనంతరం ఇంటికి వెళ్తుండగా యాక్సిడెంట్ కావడంతో నూతన వధూవరులు సహా ఏడుగురు చనిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం జార్ఖండ్‌లో వివాహం చేసుకుని బంధువులతో కలిసి వధూవరులు శనివారం ఉదయం ధామ్‌పూర్‌లోని వరుడి ఇంటికి బయల్దేరారు.

ఉదయం దట్టమైన పొగ మంచు ఆవరించి ఉండటంతో జాతీయ రహదారి 74పై వారు ప్రయాణిస్తున్న ఆటోను కారు ఢీ కొట్టింది. ఈ యాక్సిడెంట్‌లో ఆటోలో ఉన్న ఏడుగురు మృతి చెందారు.