18 July, 2026 | 12:53 PM

Breaking News

సైబరాబాద్‌వ్యాప్తంగా ఫుట్‌పాత్ ఆక్రమణల తొలగింపు   •   Skyroot Vikram-1 విజయవంతం.. దేశ రోదసీ చరిత్రలో సరికొత్త అధ్యాయం   •   విక్రమ్-1 రాకెట్ ప్రయోగం వాయిదా   •   పైకప్పు కారుతోంది.. ప్లాస్టిక్ పట్టాలే దిక్కు!   •   వాతావరణ మార్పు అనేది దూరపు ముప్పు కాదు, సజీవ వాస్తవం: మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి   •   సబితా ఇంద్రారెడ్డి, RS ప్రవీణ్ కుమార్ హౌస్ అరెస్ట్   •   బండ రామారం పాఠశాల అభివృద్ధికి కృషి చేస్తాం   •   బీఆర్ఎస్‌ యువ సంగ్రామ సభ.. ఎక్కడికక్కడే పోలీసుల అరెస్ట్‌లు   •   Sonam Wangchuk: వాంగ్‌చుక్ దీక్షకు బ్రేక్.. కేంద్రంపై పవార్ విమర్శలు   •   చారిత్రక జామా మసీదు విస్తరణకు శంకుస్థాపన   •  

జోనల్ స్థాయి పోటీలకు ఏడుగురు విద్యార్ధులు ఎంపిక

19-09-2025 08:03 PM

తలకొండపల్లి: మండల స్థాయి క్రీడాపోటీలలో ప్రతిభ కనబర్చి జోనల్ స్థాయి క్రీడాపోటీలకు ఏడుగురు విద్యార్ధులు ఎంపికయ్యరు. తలకొండపల్లి మండలం కేంద్రంలోని ఉన్నత పాఠశాల ఆవరణలో ఎస్ జి ఎఫ్ మండల స్థాయి వాలీబాల్, కబడ్డీ పోటీలు నిర్వహించారు.ఈ పోటీలలో ఆయా పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. పోటీలలో మండలం లోని  వెల్జాల్ పాఠశాల విద్యార్థులు కబడ్డీ 14 సంవత్సారాల బాలుర విభాగంలో పవన్, శివశంకర్, మదు, పవన్ తేజ, 17 సంవత్సారాల బాలుర విభాగంలో రామకృష్ణ, వాలీబాల్ 14 సంవత్సారాల బాలుర విభాగంలో సాత్విక్, మారుతీలు ప్రతిభ కనబర్చి జోనల్ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ పరమేశ్ తెలిపారు. ఎంపికైన విధ్యార్థులను పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నసీం సుల్తానా, ఉపాధ్యాయ బృందం, గ్రామ పెద్దలు, క్రీడాభిమానులు అభినందించారు.