calender_icon.png 19 September, 2025 | 9:58 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

దళిత బహుజన పార్టీ ర్యాలీ విజయవంతం చేయాలి

19-09-2025 07:59:17 PM

కరీంనగర్ క్రైం,(విజయక్రాంతి): బీజేపీ, కాంగ్రెస్ ఇండియా వంటి మనువాద దోపిడీ మాఫియా కూటమి లకు రాజకీయం ప్రత్యామ్నాయంగా జాతీయ ప్రజాస్వామిక లౌకిక కూటమి ఎన్ డి ఎస్ ఎఫ్  ఏర్పాటు చేయడం జరిగిందని.. ఈ నెల 26న హైదరాబాద్ ప్రెస్ క్లబ్ లో జరిగే ఆవిర్భావ మహా సభ.. ర్యాలీ లను విజయవంతం ఫ్రంట్ చైర్మన్, దళిత బహుజన పార్టీ జాతీయ అధ్యక్షులు వడ్లమూరి కృష్ణ స్వరూప్ పిలుపునిచ్చారు.

శుక్రవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీల నాయత్యం లో ఉన్న వివిధ రాజకీయ పార్టీలు, కుల ప్రజాసంఘాలు ఆధ్వర్యంలో రాజకీయ ఫ్రంట్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. రానున్న స్థానిక సంస్థలు, జూబ్లీహిల్స్ తో సహా 11 అసెంబ్లీ ఉప ఎన్నికల్లో ఫ్రంట్ తరుపున ఉమ్మడి గా పోటీ చేస్తామన్నారు. బీజేపీ, కాంగ్రెస్, బి ఆర్ ఎస్ అంతా ఒక్కటేనని వారి అజెండా కేవలం దళిత, బహుజన ప్రజలను సామాజిక అణిచివేసి దోపిడీ చేయడమేనన్నారు.