ఖైరతాబాద్‌లో 70 అడుగుల భారీ వినాయక విగ్రహం
- కర్రపూజతో విగ్రహం తయారీకి శ్రీకారం
హైదరాబాద్ సిటీబ్యూరో, జూన్ 17 (విజయక్రాంతి): ఖైరతాబాద్ మహాగణపతి ఉత్సవాలకు బీజం పడింది. వినాయక చవితికి ఇంకా 82 రోజులుండగా, సోమవారం కర్రపూజతో విగ్రహ తయా రీకి ఉత్సవ కమిటీ శ్రీకారం చుట్టింది. ఈ ఏడాదితో ఉత్సవాల నిర్వహణ 70 ఏళ్లకు చేరుకుంటున్న నేపథ్యంలో ఈసారి 70 అడుగుల విగ్రహం నెలకొల్ప నున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ఏటా 150 మంది కళాకారులు విగ్రహ తయారీలో పాల్గొంటుడగా ఈ సారి మరింత మందిని పెడుతున్నట్లు తెలిపారు.
సోమవారం నాటి కర్రపూజకు హాజరైన ఎమ్మెల్యే దానం నాగేందర్ మాట్లాడుతూ ఖైరతాబాద్ వినాయకుడి తయారీ కోసం సంప్రాదాయ బద్దంగా కర్ర పూజ చేసినట్లు పేర్కొన్నారు. వినాయక ఉత్స వాలు గతం కంటే మెరుగ్గా నిర్వహించేందుకు రెండు, మూడ్రోజుల్లో ఉత్సవ కమిటీతో సమావేశమై చర్చింనున్నట్లు తెలిపారు. గణేషుడి దర్శనం కోసం వచ్చే ప్రతి భక్తుడికి ప్రసాదం అందేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కార్యక్రమంలో ఉత్సవ కమిటీ నాయకులు సందీప్ రాజ్, రాజ్‌కుమార్, కృష్ణ యాదవ్, బస్తీ నాయకులు పాల్గొన్నారు.






