21 July, 2026 | 9:04 AM

తిరుమల శ్రీవారి సేవలో పలువురు నేతలు

20-07-2026 08:23 PM

​ఆమనగల్లు,(విజయక్రాంతి): తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామివారిని పలువురు ప్రజాప్రతినిధులు, రాజకీయ నాయకులు సోమవారం వీవీఐపీ బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో అర్చకులు, వేద పండితులచే వేద ఆశీర్వచనం స్వీకరించారు. ​ఈ దర్శనం పొందిన వారిలో ఆమనగల్ మాజీ వైస్ ఎంపీపీ జక్కు అనంత్ రెడ్డి, వనస్థలిపురం మాజీ కార్పొరేటర్ రాహుల వెంకటేశ్వర రెడ్డి, అచంపేట మాజీ మార్కెట్ వైస్ చైర్మన్ చంద్రశేఖర్ రెడ్డి, నాయకులు శ్రవణ్ కుమార్ రెడ్డి, దేవేందర్ రెడ్డి, రమాకాంత్ రెడ్డి ఉన్నారు. ​ఈ సందర్భంగా నేతలు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని కోరుకున్నట్లు తెలిపారు. అలాగే కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా, ఆనందంగా ఉండేలా ఆశీర్వదించాలని శ్రీవారిని ప్రార్థించినట్లు పేర్కొన్నారు.