బీజేపీ గ్రామ శాఖ నూతన కమిటీ ఎన్నిక
మల్లాపూర్,(విజయక్రాంతి): మల్లాపూర్ మండలం మొగిలిపేట గ్రామంలో సోమవారం బీజేపీ గ్రామ శాఖ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో గ్రామ శాఖ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. గ్రామ శాఖ అధ్యక్షుడిగా గోల్కొండ గంగారెడ్డి (బాపూజీ)ని, గ్రామ శాఖ ఉపాధ్యక్షుడిగా పీట్ల సాయిరాంను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సమావేశంలో ప్రకటించారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన నాయకులను పార్టీ కార్యకర్తలు అభినందించి, గ్రామంలో పార్టీ బలోపేతానికి సమష్టిగా కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన కమిటీ సభ్యులు మాట్లాడుతూ... పార్టీ సిద్ధాంతాలను గ్రామ ప్రజలకు చేరవేసేందుకు, గ్రామ అభివృద్ధి అంశాలపై ప్రజలతో కలిసి పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మొగిలిపేట గ్రామానికి చెందిన బీజేపీ కార్యకర్తలు, నాయకులు, పార్టీ అభిమానులు పాల్గొన్నారు.






