02-02-2026 08:15:58 PM
జనసందోహం మధ్య గుర్రంపీర్ ఉర్సు ఉత్సవాలు
షాద్ నగర్,(విజయక్రాంతి): భక్తజన సందోహం మధ్య గుర్రం పీర్ ఉర్సు ఉత్సవాలు ఘనంగా జరిగాయి. రంగారెడ్డి జిల్లా చౌదర్ గూడం మండలం గుర్రంపల్లి గ్రామంలో గుర్రంపీర్ ఉరుసు ఉత్సవాలు ప్రతి ఏడాది వైభవంగా జరుగుతాయి. జనవరి 30న ప్రారంభమై జాతర మూడవ రోజున సోమవారం కందూరు కార్యక్రమంలో భక్తులు గుర్రంపీర్‌కు మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ ఉత్సవాల్లో వేలాది మంది భక్తులు వివిధ గ్రామాల నుండి తరలివచ్చారు. ఈ రోజు షాద్ నగర్ ఏసీపీ లక్ష్మీనారాయణ ఈ ఉర్సు ఉత్సవాలను పర్యవేక్షించారు..అనంతరం ఏసీపీ మాట్లాడుతూ చుట్టుపక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొంటున్న నేపథ్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశామని భక్తులు ఎలాంటి ఇబ్బందులకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో మొక్కలు చెల్లించుకోవాల్సిందిగా సూచించారు. ఈ కార్యక్రమంలో చౌదర్ గూడెం ఎస్సై విజయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు..