25 March, 2026 | 5:32 PM

షాద్‌నగర్‌ డిటెక్టివ్‌ ఇన్‌స్పెక్టర్‌ రామిరెడ్డి సస్పెండ్‌

05-08-2024 03:34 PM

హైదరాబాద్: షాద్ నగర్ ఘటనలో డీఐ రామిరెడ్డితో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లు సస్పెండ్ చేస్తూ హైదరాబాద్ సీపీ అవినాష్ మహంతి ఉత్తర్వులు జారీ చేశారు. చోరీ కేసులో సునీత అనే మహిళను పీఎస్ కు పిలిపించిన పోలీసులు తీవ్రంగా కొట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఘటనపై విచారణ జరిపిన షాద్ నగర్ ఏసీపీ రంగస్వామి నివేదికను హైదరాబాద్ సీపీ అవినాష్ మహంతికి సమర్పించారు. నివేదిక ఆధారంగా డీఐతో పాటు ఐదుగురు కానిస్టేబుళ్లను సస్పెండ్ చేశారు.