25 March, 2026 | 6:03 PM

Breaking News

లొంగిపోయిన మావోయిస్టు అగ్రనేత పాపారావు

25-03-2026 04:28 PM

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టు సంస్థకు చెందిన అగ్ర నాయకుడు పాపారావుతో(Maoist Leader Paparao Surrender) సహా మొత్తం 18 మంది మావోయిస్టులు బుధవారం నాడు ఛత్తీస్‌గఢ్ ఉప ముఖ్యమంత్రి విజయ శర్మ ఎదుట లొంగిపోయారు. ఆయుధాలు విడిచిపెట్టి లొంగిపోయిన వారిలో ఏడుగురు మహిళలు ఉన్నారు. పాపారావు మావోయిస్టు సంస్థ రాష్ట్ర జోనల్ కమిటీ సభ్యుడిగా పనిచేశారు. దండకారణ్య ప్రాంతానికి చెందిన మోస్ట్ వాంటెడ్ పాపారావుపై రూ.2 కోట్ల రివార్డుఅనేక హింసాత్మక ఘటనలకు పాపారావు సూత్రధారిగా ఉన్నారు. దండకారణ్యంలో మావోయిస్టు సంస్థ విస్తరణలో పాపారావు కీలక పాత్ర పోషించారు. 

బస్తర్ ప్రాంతపు డివిజనల్ కేంద్రమైన జగదల్‌పూర్‌లో ఏర్పాటు చేసిన ఒక కార్యక్రమంలో ఈ మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయే సమయంలో వారు ఎనిమిది ఏకే-47 రైఫిల్స్, ఒక సెల్ఫ్-లోడింగ్ రైఫిల్, ఒక బారెల్ గ్రెనేడ్ లాంచర్‌తో పాటు ఇతర ఆయుధాలను అధికారులకు అప్పగించారు. కాగా ఆపరేషన్ కగార్ క్లైమాక్స్ స్టేజ్ కి చేరింది. దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు ఎంత మంది మావోయిస్టులు సరెండర్ అయ్యారు. డెడ్ లైన్ లోపు మిగిలినవాళ్లు దొరక్కపోతే ఏంటీ పరిస్థితి అన్న ప్రశ్న అందరిలో మెదులుతోంది. మరో ఆరో రోజుల్లో మావోయిస్టులకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ ఇచ్చిన డైడ్ లైన్ ముగియనుంది.