5 May, 2026 | 7:03 PM

Breaking News

కలెక్టర్‌ను కలిసిన డీఎఫ్ఓ బాలమణి   •   భారతీయ సంస్కృతిని గౌరవించే పౌరులను తయారు చేయడమే బాలమంగళం లక్ష్యం   •   జిల్లా రెడ్ క్రాస్‌ సొసైటీని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలి   •   సిబ్బంది సమయపాలన పాటించాలి: జిల్లా కలెక్టర్ హరిత   •   ఈఎంఆర్ఎస్ లో 11వ తరగతిలో దరఖాస్తులకు ఆహ్వానం   •   సిరిసిల్ల పిఏసీఎస్ పాలకవర్గం బాధ్యతల స్వీకారం   •   ఎలక్ట్రానిక్ ఓటింగ్ గోదాం వద్ద పటిష్ట భద్రత: కలెక్టర్ హరిత   •   సహకార సంఘాల పాత పాలకవర్గం సభ్యులు తిరిగి బాధ్యతలు స్వీకరణ   •   ప్రధాని నరేంద్ర మోడీ బహిరంగ సభకు సంపూర్ణ మద్దతు   •   అడవుల సంరక్షణలో సిబ్బంది కార్యోన్ముఖులు కావాలి: డీఎఫ్ఓ బాలమణి   •  

షాద్‌నగర్ ఎస్‌ఐని డిస్మిస్ చేయాలి

10-08-2024 04:15 AM

బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్

ఎల్బీనగర్, ఆగస్టు 9: ఓ కేసు విషయమై పీఎస్‌కు పిలిచి దళిత మహిళపై షాద్‌నగర్ పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు మంద ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పోలీసుల దౌర్జన్యాన్ని నిరసిస్తూ శుక్రవారం ఎల్బీనగర్ రింగ్‌రోడ్డులో బీఎస్పీ నాయకులు, కార్యకర్తలతో కలిసి ప్రభాకర్ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దళిత మహిళపై షాద్‌నగర్ పోలీసులు వ్యవహరించిన తీరు రాష్ట్ర పోలీస్ వ్యవస్థకే మాయని మచ్చ అన్నారు.

ఫ్ల్రెండ్లీ పోలీసింగ్, ప్రజా పాలన అంటే ఇదేనా అని విమర్శించారు. ఇదే దాడి అగ్రవర్ణాల మహిళలపై జరిగితే ఇలాగే ఉంటారా? అని ప్రశ్నించారు. దళిత మహిళపై దాడి చేసిన షాద్‌నగర్ ఎస్‌ఐపై కేసు నమోదు చేయడంతో పాటు అతడిని ఉద్యోగం నుంచి శాశ్వతంగా తొలిగించాలని డిమాం డ్ చేశారు. బీఎస్పీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు ప్రవీణ్‌కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు ధర్మేందర్, అడ్వోకేట్ నిషా ని రామచంద్రం, రాష్ట్ర కార్యదర్శులు జగన్, దయాకరణ్ మౌర్య, నాయకులు.. రాములు, నాగరాజు, రవీంద ర్, అర్జున్ తదితరులు పాల్గొన్నారు.