18 July, 2026 | 12:30 AM

పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలి

18-07-2026 12:00 AM

ఫ్యూచర్ సిటీ సీపీ డా. తరుణ్ జోషి

షాద్‌నగర్ జోన్ క్రైమ్ సమీక్షా సమావేశం

టెక్నాలజీని ఉపయోగించి నేరాలను అదుపు చేయాలని ఆదేశం

రంగారెడ్డి, జూలై 17 (విజయక్రాంతి): షాద్నగర్ జోన్ పరిధిలో పెండింగ్ లో ఉన్న కేసులను త్వరితగతిన పూర్తి చేయాలని ఫ్యూచర్ సిటీ పోలీస్ కమిషనర్ డా. తరుణ్ జోషి, ఐపీస్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం టీజీపీఏ పోలీస్ అకాడమీలో షాద్నగర్ జోన్కు సంబంధించిన క్రైమ్ రివ్యూ సమావేశాన్ని ఆయన నిర్వహించారు.

ఈ సందర్భంగా జోన్ పరిధిలోని గ్రేవ్ కేసులు, పోక్సో కేసులు, ఎస్సీ/ఎస్టీ  కేసులు, పీడీ యాక్ట్ కేసుల పురోగతిని కమిషనర్ సమగ్రంగా సమీక్షించారు.ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ అధికారులకు పలు కీలక సూచనలు చేశారు. ప్రతి కేసులోనూ నాణ్యమైన దర్యాప్తు జరగాలని, బాధితులకు త్వరితగతిన న్యాయం జరిగేలా చూడాలని స్పష్టం చేశారు.కేసుల దర్యాప్తును వేగవంతం చేయడానికి సీసీటీన్స్ మరియు ’ఈ-సాక్షి’  అప్లికేషన్లను అధికారులు సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు.

రోజురోజుకూ పెరుగుతున్న సైబర్ నేరాల పట్ల ప్రత్యేక దృష్టి సారించాలని, ప్రజలకు ఈ విషయాలపై నిరంతరం అవగాహన కల్పించాలని సూచించారు.రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టడంతో పాటు, వాహనదారుల్లో ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన పెంచాలని సూచించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ప్రజలతో స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ, పోలీస్-ప్రజల అనుబంధాన్ని మరింత బలోపేతం చేయాలని సీపీ పేర్కొన్నారు. సమీక్షా సమావేశంలో షాద్నగర్ జోన్ డీసీపీ శ్రీమతి చి. శీరీష, అడిషనల్ డీసీపీ శ్రీ సాయిక్ జహంగీర్, ఎస్బీ ఏసీపీ శ్రీ హుస్త్స్రనీ నాయుడు, షాద్నగర్ ఏసీపీ శ్రీ ఎస్. లక్ష్మీనారాయణ, ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ బి. జేమ్స్ బాబు, సీసీర్బ్ ఇన్స్పెక్టర్ బి. వీరబాబు మరియు జోన్ పరిధిలోని అన్ని పోలీస్ స్టేషన్ల స్టేషన్ హౌస్ అధికారులు పాల్గొన్నారు.