జీహెచ్‌ఎంసీలో షాడో పాలన!
- ఔట్ సోర్సింగ్ భార్యాభర్తలదే హవా
- అడ్వర్టైజ్మెంట్ వింగ్‌లో పర్మినెంట్ ఉద్యోగులపై వేధింపులు
కమిషనర్ కర్ణన్ ఆదేశాలు బేఖాతర్
ఏడేళ్లుగా ఒకే సీటులో పాతుకుపోయిన వైనం
స్పెషలాఫీసర్‌కు ఫిర్యాదు చేసే యోచనలో బాధితులు
హైదరాబాద్ సిటీ బ్యూరో, మార్చి 4 (విజయక్రాంతి):గ్రేటర్ హైదరా బాద్ మున్సిపల్ కార్పొరే షన్ (జీహెచ్‌ఎంసీ) ప్రధాన కార్యాలయంలో కొం దరు ఔట్ సోర్సిం గ్ ఉద్యోగులు ఆడిందే ఆట.. పాడిందే పాటగా సాగుతోంది. ఎంతటి సమర్థులైన ఐఏఎస్ అధికారులు కమిషనర్లుగా వచ్చినా తమ పంథా మారదన్నట్లుగా వారి వ్యవహారశైలి ఉం టోంది. ప్రధానంగా జీహెచ్‌ఎంసీకి అత్యంత కీలకమైన ఆదాయ వనరుగా ఉన్న అడ్వర్టైజ్మెంట్ వింగ్ పూర్తిగా ఓ ఔట్ సోర్సిం గ్ దంపతుల గుప్పెట్లోకి వెళ్లిపోయిందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి.
అధికారుల ఆదేశా లను సైతం బేఖాతర్ చేస్తూ.. పర్మినెంట్ ఉద్యోగులపై డామినేషన్ చెలాయిస్తున్న సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి తీరు ఇప్పుడు జీహెచ్‌ఎంసీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అడ్వర్టైజ్మెంట్ వింగ్‌లో పనిచేస్తున్న ఓ ఔట్ సోర్సింగ్ ఉద్యోగిని, పబ్లిక్ హెల్త్‌కు చెందిన ఓ అసిస్టెంట్ ఇంజినీర్ భార్యాభర్తలు సెక్షన్ మొత్తాన్ని తమ గుప్పెట్లో పెట్టుకున్నట్లు సమాచారం.
సుమా రు ఏడేళ్లుగా స్థానచలనం లేకుండా ప్రధాన కార్యాలయం లోని అడ్వర్టైజ్మెంట్ వింగ్లోనే పాతుకుపోయిన సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి పలు అక్రమాలకు పాల్పడుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. వీరి ఆగడాలు ఎంతలా శ్రుతిమించాయంటే.. మూ డు, నాలుగో తరగతికి చెందిన పర్మినెంట్ ఉద్యోగులను సైతం టార్గెట్ చేసి, మానసికంగా వేధింపులకు గురిచేస్తున్నట్లు తెలిసింది.
వాస్తవానికి మూడేళ్ల క్రితం సదరు ఔట్ సోర్స్ ఉద్యోగి ఐటీ విభాగంలో సక్రమంగా విధులు నిర్వహించకపోవడంతో, అప్పటి ఐటీ అదన పు కమిషనర్ ఆ ఉద్యోగిని అక్కడి నుంచి అడ్వర్టైజ్మెంట్ వింగ్కు బదిలీ చేశారు. అయినప్పటికీ ఆ ఉద్యోగి తీరు మారలేదు.
కమిషనర్ ఆదేశాలకే దిక్కులేదు
జీహెచ్‌ఎంసీని మూడు కార్పొరేషన్లుగా పునర్వ్యవస్థీకరించిన క్రమంలో గత నెల 11న కమిషనర్ ఆర్‌వీ కర్ణన్ పలువురు ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను బదిలీ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. కానీ ఈ బదిలీ ఆదేశా లు సదరు ఉద్యోగి విషయంలో బుట్టదాఖలయ్యాయి.
బదిలీల సమయంలో తనకు కూడా స్థానచలనం తప్పదని భావించిన సద రు ఉద్యోగి జీహెచ్‌ఎంసీ అడ్వర్టైజ్మెంట్ విం గ్కు చెందిన అత్యంత కీలకమైన, సున్నితమైన డేటాను పెన్ డ్రైవ్లలో కాపీ చేసుకుని తీసుకెళ్లినట్లు తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ తతంగం మొత్తానికి పబ్లిక్ హెల్త్‌కు చెందిన సదరు అసిస్టెంట్ ఇంజినీర్ అండదండలు అందిస్తున్నట్లు స్పష్టమవుతోంది.
సంతకం ఒకచోట.. పైరవీలు మరోచోట
ఇటీవల కమిషనర్ జారీ చేసిన బదిలీల ఉత్తర్వుల ప్రకారం.. సదరు ఔట్ సోర్సింగ్ ఉద్యోగి ఐటీ వింగ్‌లో కంప్యూటర్ ఆపరేటర్‌గా విధులు నిర్వర్తించాల్సి ఉంది. కానీ తన పరపతితో ఆ బదిలీని తనకు అనుకూ లంగా మలుచుకుని చక్రం తిప్పుతున్నారు. రోజూ ఐటీ సెక్షన్‌లో అటెం డెన్స్ వేసుకుని.. ఐటీ, సెంట్రల్ ట్యాక్స్, అడ్వర్టైజ్మెంట్.. ఇలా ఏకంగా మూడు సెక్షన్లలో విధులు నిర్వహిస్తున్నట్లు నటిస్తూ పైరవీలకు పాల్పడు తున్నట్లు సమాచారం. కాగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఉద్యోగుల బదిలీ లకు సంబంధించి ఉత్త ర్వులు జారీ చేయడమే తప్ప..
క్షేత్రస్థాయిలో ఆ ఆదేశాలు అమలవుతున్నాయా లేదా అన్నది పర్యవేక్షించకపోవడం వల్లే ఇలాంటి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సదరు దంపతులపై ఉన్నతాధికారులు తక్షణమే స్పం దించి కఠిన చర్యలు తీసుకోవాలని సిబ్బంది కోరుతున్నారు. లేని పక్షంలో ప్రభు త్వ స్పెషలాఫీసర్‌కు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం.




