5 March, 2026 | 5:09 AM

జీహెచ్‌ఎంసీ అప్పుల భారం ఇక సర్కారుదే

05-03-2026 12:00 AM
  1. రూ.4,876 కోట్ల బల్దియా అప్పులు తీర్చేందుకు గ్రీన్ సిగ్నల్ 

మూడు కొత్తకార్పొరేషన్లకు ఆర్థిక కష్టాలు తప్పించేందుకే ఈనిర్ణయం 

ఈఎంఐల నుంచి విముక్తి 

హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 4 (విజయక్రాంతి): జీహెచ్‌ఎంసీ విభజన నేప థ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. జీహెచ్‌ఎంసీ పేరిట ఉన్న భారీ అప్పు ల భారాన్ని పూర్తిగా తన భుజాలపై వేసుకునేందుకు సిద్ధమైంది. జీహెచ్‌ఎంసీకి ఉన్న రూ.4,876 కోట్ల భారీ అప్పులను తానే స్వ యంగా చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. బల్దియా రుణాలను పంపిణీ చేసి సర్దుబాటు చేసేందుకు ప్రభు త్వం ఒక ప్రత్యేక టాస్క్ ఫోర్స్ కమిటీని కూడా ఏర్పా టు చేసినట్లు ఉన్నతాధికారులు వెల్లడించా రు.

నగరంలో మౌలిక సదుపాయాల కల్పన కోసం జీహెచ్‌ఎంసీ గత పదేళ్ల కాలంలో భారీగా రుణాలు తీసుకుంది. 2014 నుంచి నగరంలో ఎస్‌ఆర్డీపీ పథకం కింద ఫ్లైఓవర్లు, అండర్ పాస్లు, అలాగే నాలాల నిర్మాణం, అభివృద్ధి పనుల నిమిత్తం ఏకంగా రూ.6,530 కోట్ల మేర అప్పులు చేసింది. ఈ రుణాలకు సంబంధించి గత రెండేళ్లుగా ప్రతీ నెలా వడ్డీలు, అసలు కలిపి సుమారు రూ.100 కోట్ల మేర ఈఎంఐల రూపంలో జీహెచ్‌ఎంసీ బ్యాంకులు, ఇత ర ఆర్థి క సం స్థలకు చెల్లిస్తూ వస్తోంది. బల్దియాకు వచ్చే ఆదాయంలో సింహభాగం ఈ అప్పుల కిస్తీలకే సరిపోతుండటంతో నిధుల లేమి ప్రధా న సమస్యగా మారింది.

ఇప్పుడు ఆ అప్పులను కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు దామా షా పద్ధతిలో పంచితే, అవి తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయే ప్రమాదం ఉందని ప్రభుత్వం గుర్తించి ఈ దిశగా అడుగులు వేసింది. ప్రభుత్వం ఈ అప్పులను తన ఖాతాలో వేసుకోవడం వెను క ఓ బలమైన ఆర్థిక సర్దుబాటు లెక్క దాగి ఉంది. వాస్తవానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి జీహెచ్‌ఎంసీకి భారీ మొత్తంలో పాత బకాయిలు రావాల్సి ఉంది.

స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నుంచి బల్దియాకు మ్యుటేషన్ ఫీజుల కింద సుమారు రూ.2,500 కోట్లు రావాలి. దీనికి తోడు నగర పరిధిలో ఉన్న వివిధ రాష్ట్ర ప్రభుత్వ కార్యాలయాలు, భవనాలకు సంబంధించి లాంగ్ స్టాండింగ్‌గా ఏళ్లుగా పేరుకుపోయిన ప్రాపర్టీ ట్యాక్స్ బకాయిలు రూ.5,500 కోట్ల వరకు ఉన్నా యి. ఈ బకాయిలు కలిపితే రాష్ట్ర ప్రభుత్వమే బల్దియాకు దాదాపు రూ. 8వేల కోట్ల వరకు చెల్లించాల్సి ఉంది.

ఆయా శాఖ ల నుంచి ఈ బకాయిలను నేరుగా మున్సిపల్ కార్పొరేషన్లకు చెల్లించే బదులు.. జీహెచ్‌ఎంసీ పేరుతో ఉన్న రూ.4,876 కోట్ల అప్పు లను ప్రభుత్వమే బ్యాంకులకు చెల్లించి, ఆ లెక్కలను సర్దుబాటు చేయాలని ఆర్థిక శాఖ నిర్ణయించినట్లు సమాచారం. ప్రభుత్వ నిర్ణయంతో కొత్తగా ఏర్పడిన మూడు మున్సిపల్ కార్పొరేషన్లకు భారీ ఊరట లభించినట్లయింది. ప్రతీ నెలా రూ.100 కోట్ల రుణాల చెల్లింపుల భారం నుంచి కొత్త కార్పొరేషన్లకు విముక్తి లభిస్తుంది.