చెన్నై మ్యాచ్‌లకు భారీ వ్యూయర్‌షిప్
- ధోనీ లేకున్నా తగ్గని క్రేజ్
- రెండో స్థానంలో ఆర్‌సీబీ
- స్టార్‌స్పోర్ట్స్ నివేదిక విడుదల
ముంబై, మే 9 : ఐపీఎల్ 19వ సీజన్ సెకండాఫ్ ఉత్కంఠభరితంగా సాగుతోంది. ఫస్టాఫ్‌లో చతికిలపడిన టీ మ్స్ ఇప్పుడు సెకండాఫ్‌కు వచ్చేసరికి ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే లీగ్ స్టేజ్ చివరి మ్యాచ్ ముగిసేవరకూ ప్లే ఆఫ్ బెర్తులు ఖరారయ్యేలా కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో వ్యూయ ర్ షిప్‌కు సంబంధించి ఆసక్తికర గ ణాంకాలు బయటకొచ్చాయి. ఐపీఎల్ బ్రాడ్‌కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ ఇప్పటి వరకూ జరిగిన మ్యా చ్‌లకు సంబంధించి వ్యూస్, ఇతర వివరాలతో నివే దికను విడుదల చే సింది.
మే 1 వరకు జరిగిన మ్యాచ్‌ల టీవీ, డిజిటల్ స్ట్రీ మింగ్ డేటా లెక్కలను వెల్లడించింది. దీని ప్రకారం చెన్నై సూపర్ కింగ్స్ ఆడే మ్యాచ్‌లను ప్రేక్షకులు అత్యధిక సంఖ్యలో వీక్షించినట్టు వెల్లడైంది. సీఎస్కే మ్యాచ్‌లను సగటను 308 మిలియన్ల మంది చూస్తున్నారు. చెన్నై మాజీ కెప్టెన్, దిగ్గజ ఆటగాడు మహేంద్రసింగ్ ధోనీ ఈ సీజన్‌లో ఒక్క మ్యాచ్ ఆడకపోయినా కూడా ఆ జట్టు మ్యాచ్‌లకు క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. గతంతో పోలిస్తే ఇంకా భా రీగా వ్యూయర్ షిప్ పెరిగిందని నివేదిక ద్వారా తెలుస్తోంది.
ఈ జాబితా లో డిఫెండింగ్ ఛాంపియన్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు రెండో స్థానం లో ఉంది. ఆర్సీబీ మ్యాచ్‌లను సగటున 300 మిలియన్ల మంది వీక్షిస్తు న్నారు. అలాగే మాజీ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ పేలవ ప్రదర్శన కనబరుస్తున్నా ఆ జట్టు క్రేజ్ కూడా తగ్గలేదు. ముంబై మ్యాచ్‌లను సగటున 293 మిలియన్ల మంది వీక్షించి నట్టు వెల్లడైంది. అలాగే సన్ రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్‌లకు 290 మిలియన్ల మంది, కోల్ కతా నైట్ రైడర్స్ కు 280 మిలియన్ల మందితో వ్యూ యర్ షిప్ లభించింది.






