calender_icon.png 6 December, 2025 | 4:06 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png
Breaking News

శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ గురు వందనంలో పాల్గొన్న ఎమ్మెల్యే పోచారం

06-12-2025 02:45:47 PM

బాన్సువాడ,(విజయక్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలం దేశాయ్ పేట్ గ్రామంలో మాజీ సర్పంచ్ శ్రావణ్ ఇంటి పరిసర ప్రాంతాల్లో శుక్రవారం రాత్రి శ్రీ సద్గురు స్వామి సమర్థ మహారాజ్ ఆధ్వర్యంలో జరిగిన శ్రీ రామ నామస్మరణ గురు వందనం కార్యక్రమానికి ప్రభుత్వ వ్యవసాయ సలహాదారులు ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి, పోచారం శంభు రెడ్డి ,మాజీ డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డిలు హాజరయ్యారు. మోరీల్ శ్రావణ్, మోరీల్ శ్రీనివాసులు స్వామీజీ రాక కోసం భారీ ఏర్పాట్లు చేశారు. భక్తులకు ప్రత్యేక ఆశీర్వాదాలు అందేలా స్వామీజీతో ప్రత్యేక ఆశీర్వాదాలు అందజేయడం జరిగింది. భక్తుల కోసం మహా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పోచారం కుటుంబ సభ్యులను ఆశీర్వదించారు. స్వామీజీ ఆశీర్వాదం కోసం భారీ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఎలాంటి తొక్కేసిలాట జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.ఈ కార్యక్రమంలో  మండల నాయకులు, ప్రజాప్రతినిధులు, పెద్ద ఎత్తున దేశాయ్ పేట్  తో పాటు ఇతర గ్రామాల ప్రజలు పాల్గొన్నారు.