calender_icon.png 15 November, 2025 | 12:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ముంబై ఇండియన్స్‌లోకి శార్థూల్ ఠాకూర్

14-11-2025 12:00:00 AM

ముంబై, నవంబర్ 13 : ఐపీఎల్ 2026 సీజన్ మినీ వేలానికి ముందు ట్రేడింగ్ చేసిన తొలి జట్టుగా లక్నో సూపర్ జెయిం ట్స్ నిలిచింది.ఆల్‌రౌండర్ శార్థూల్ ఠాకూర్‌ను ముంబై ఇండియన్స్‌కు ట్రేడ్ చేసింది. ఈ మేరకు రెండు ఫ్రాంచైజీల మధ్య ఒప్పం దం కుదిరినట్టు అధికారిక ప్రకటన విడుదలైంది. గత సీజన్‌లో గాయపడిన ఆటగాడి స్థానంలో శార్థూల్ ఠాకూర్‌ను లక్నో రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.

ఇప్పుడు అంతే మొత్తానికి ముంబై ఇండియన్స్‌కు బదిలీ చేసినట్టు ఆ ఫ్రాంచైజీ తెలిపింది. 2025 ఐపీఎల్‌లో సీజన్‌లో లక్నో తరపున శార్థూల్ 10 మ్యాచ్‌లు ఆడి 13 వికెట్లు పడగొట్టాడు. ఓవరాల్‌గా ఐపీఎల్ కెరీర్‌లో 105 మ్యాచ్‌లు ఆడి 107 వికెట్లు, 325 పరుగులు చేశాడు. కాగా శార్థూల్‌ను ట్రేడింగ్‌పై చర్చలు జరుగుతున్నప్పుడు ముంబై ఫ్రాంచైజీ అర్జున్ టెం డూల్కర్‌ను వదులుకుంటున్నట్టు కూడా వార్తలు వచ్చాయి. కానీ క్యాష్ ట్రేడింగ్‌కే ముంబై మొగ్గుచూపింది.

ఇదిలా ఉంటే కరేబియన్ హిట్టర్ షెర్ఫాన్ రూథర్‌ఫర్డ్ కూడా ముంబై ఇండియన్స్‌లోకి తిరిగి వచ్చాడు. గుజరాత్ టైటాన్స్ రూ.2.6 కోట్లకు అతన్ని ముంబైకి ట్రేడ్ చేసింది. గత సీజన్‌లో గుజరాత్ తరపున 13 మ్యాచ్‌లలో ఆడి 157కు పైగా స్ట్రుక్‌రేట్‌తో 291 రన్స్ చేశాడు. విండీస్‌కు 44 టీ ట్వంటీల్లో ప్రాతినిథ్యం వహిం చిన రూథర్‌ఫర్డ్ 588 రన్స్ చేశాడు.