కోరికను నెరవేర్చుకునేందుకే బన్నీకి ఓకే చెప్పిందట!
శ్రీలీల.. టాలీవుడ్ యంగ్ సెన్సేషనల్ హీరోయిన్‌గా ప్రస్తుతంకుర్రకారు గుండెల్లో తిష్ట వేసింది. ‘పుష్ప 2’లో అల్లు అర్జున్‌తో కిస్సిక్ అనే ప్రత్యేక గీతంలో ఈ అమ్మడు ఆడిపాడటంతో అందరూ ఐటమ్ పాప అదుర్స్ అంటూ మెచ్చుకుంటున్నారు. అయితే శ్రీలీలకు ఈ ఐటమ్ సాంగే తొలిది, చివరిది కావొచ్చు! ఎందుకంటే ఇకపై ప్రత్యేక గీతాలకు దూరంగా ఉండాలని ఈ చిన్నది భావించడమే కారణం. స్పెషల్ సాంగ్‌తో ఉన్న లాభాల కన్నా హీరోయిన్‌గా కేరీర్ క్లోజ్ అయి, ‘ఐటెమ్ గాళ్’గా ముద్ర పడిపోతుందని భయపడినట్టుంది శ్రీలీల. ‘పుష్ప 2’తో పాటే మరికొన్ని ఐటమ్ సాంగ్ ఆఫర్లు అందినప్పటికీ కూల్‌గా నో చెప్పిందట ఈ ముద్దుగుమ్మ.
ఇక్కడ చెప్పుకోదగ్గదేమంటే.. మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ ఐటమ్ సాంగ్ ఆఫర్‌ను కూడా వదులుకుందట. అల్లు అర్జున్‌తో డ్యాన్స్ చెయ్యాలన్న తన కోరికను నెరవేర్చుకునేందుకే కిస్సిక్‌కు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. చిరంజీవికి నో చెప్పడంతో ఈ భామ ఇప్పుడు మెగాఫ్యాన్స్ ట్రోల్స్‌కు గురైంది. ఏదేమైనా ఇకపై ఇలాంటి సినిమాలు, ఐటమ్ సాంగ్స్ చెయ్యనంటూ తాజాగా శ్రీలీల నిర్ణయం తీసుకోవటం ఆసక్తికర చర్చకు దారి తీసింది. శ్రీలీల హీరోయిన్‌గా నటించిన ‘రాబిన్‌హుడ్’ ఈ నెల 25న ప్రేక్షకుల ముందుకు రానుంది.






