భూపాలపల్లిలో గొర్ల కాపరి హత్య
15-06-2026 12:48 AM
జయశంకర్ భూపాలపల్లి (మహబూబాబాద్) జూన్ 14 (విజయక్రాంతి): భూపాలపల్లి పట్టణ పరిధిలోని వేశాలపల్లిలో కొడారి సమ్మయ్య (70) అనే గొర్ల కాపరి దారుణ హత్యకు గురయ్యాడు. గొర్రెల మంద వద్ద కాపలాగా పడుకున్న సమ్మయ్యను ఆదివారం ఉదయం సమ్మయ్య అన్న కొమురయ్య వచ్చి చూసే సరికి సమ్మయ్య రక్తపు మడుగులో మృతి చెంది ఉన్నాడు. పోలీసులకు సమాచారం అందించడంతో క్లూస్ టీం సహాయంతో ఆధారాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్‌ఐ కే. పవన్ కుమార్ తెలిపారు.






