ఘనంగా షిరిడీ సాయిబాబా దేవాలయ వార్షికోత్సవం
హుజురాబాద్,ఫిబ్రవరి26: (విజయక్రాంతి)కరీంనగర్ జిల్లా హుజురాబాద్ పట్టణంలోని శ్రీ గణపతి దత్తాత్రేయ సహిత. శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయ నవదశ 19వ వార్షికోత్సవ సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సమస్త దేవతారూప సర్వసిద్ధి ప్రదాయక సర్వభక్త జనోద్ధార సాయినాథ నమోస్తుతే. హుజురాబాద్ సాయిబాబా టెంపుల్ లో గురువారం రోజున శ్రీ షిరిడి సాయిబాబా దేవాలయములో ఉదయం 8 గంటలకు ఆలయ ప్రధాన అర్చకుడు వరుణ్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవాచనము,
అఖండ దీపారాధన, దత్తాత్రేయ స్వామి పూజ, శ్రీషిరిడి సాయిబాబా పూజలు నిర్వహించారు10-00 గంలకు శ్రీ శిరిడి సాయిబాబా స్వామి వారికి పంచామృతాభిషేకం జరుపబడింది. మద్యాహ్నం గం12-30నిలకు హారతి, మంత్రపుష్పం, తీర్ధ ప్రసాద వితరణ పెద్ద సంఖ్యలోభక్తులు హాజరై విజయవంతం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీ షిరిడి సాయిబాబా సంస్థాన్ ట్రస్టు వెంపటి సదానందం, ఇనుగాల సత్తిబాబు, ఆలయ కమిటీ, అర్చకులు, తో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.




