27 February, 2026 | 4:32 AM

నారపల్లిలో స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్‌ను పరిశీలించిన మల్కాజిగిరి మున్సిపల్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి

27-02-2026 12:32 AM

ఘట్ కేసర్, ఫిబ్రవరి 26 (విజయక్రాంతి): ఘట్ కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్, నారపల్లి ప్రాంతాన్ని మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వినయ్ కృష్ణారెడ్డి గురువారం సందర్శించి వీధి దీపాల పర్యవేక్షణకు సంబంధించిన స్ట్రీట్ లైటింగ్ సిస్టమ్ ను పరిశీలించి డేటా ఎంట్రీ నమోదు ప్రక్రియను ప్రత్యక్షంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డేటా ఎంట్రీ నిర్వహణ విధానాన్ని స్వయంగా పరిశీలించి ఒక నమోదు ప్రక్రియను ధృవీకరించారు.

ఎస్‌ఎల్‌ఎంఎస్ డేటా ఎంట్రీలో ఖచ్చితత్వం, సమగ్రత, సమయపాలనను నిర్ధారించేందుకు ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని సంబంధిత సిబ్బందికి కమిషనర్ ఆదేశించారు.అనంతరం ఘట్ కేసర్ సర్కిల్లో స్వచ్ఛ ఆటోల ద్వారా నిర్వహిస్తున్న ఇంటింటి చెత్త సేకరణ వ్యవస్థపై సమీక్ష నిర్వహించి, ప్రతి రోజు అన్ని వార్డుల్లో వంద శాతం చెత్త సేకరణ జరిగేలా వాహనాల సమర్థ వినియోగం, రూట్ మ్యాపింగ్, పర్యవేక్షణను బలోపేతం చేయాలని సూచించారు.ఈకార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ వాణి రెడ్డి, డీఈఈ నరేష్ కుమార్, ఏఈ రవికిరణ్, ఏఈ విశేష్ నాయక్, ఎస్డబ్ల్యూఎమ్ ఏఈఈ చంద్రశేఖర్, కాలనీ నివాసులు పాల్గొన్నారు.