వేములవాడ రాజన్న ఆలయంలో ప్రారంభమైన శివకళ్యాణ మహోత్సవాలు
వేములవాడ, మార్చి 5,(విజయక్రాంతి)రాజన్న సిరిసిల్ల జిల్లా, వేములవాడలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో శివకళ్యాణ మహోత్సవాలు ఘనంగా ప్రారంభమ య్యాయి. ఆలయ విస్తరణ పనుల నేపథ్యంలో ఈ వేడుకలను ఆలయ అర్చకులు, వేద పండితులు ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.మహోత్సవాల ప్రారంభం సందర్భంగా ఉదయం స్వస్తి పుణ్యాహవాచనం, అంకురార్పణ, దేవతా ఆహ్వానం, చండీ ప్రతిష్ఠ వంటి పూజా కార్యక్రమాలను సంప్రదాయ బద్ధంగా నిర్వహించారు.
ఐదు రోజుల పాటు కొనసాగే ఈ ఉత్సవాల్లో భాగంగా శుక్రవారం ఆలయ పార్కింగ్ ప్రాంగణంలోని శివార్చన వేదికపై స్వామివారి కళ్యాణోత్సవాన్ని నిర్వహించనున్నారు.ఆదివారం సాయంత్రం రథోత్సవం నిర్వహించనుండగా, సోమవారం అవబృతం, ఏకాదశ ఆవరణాలతో శివకళ్యాణ మహోత్సవాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా ఆలయ ఈఓ ఎల్. రమాదేవి యాగశాలను సందర్శించి అర్చకులు, వేద పండితులకు వర్ని సమర్పించారు.




