6 March, 2026 | 1:45 AM

హైదరాబాద్‌లో సిలికాన్ ల్యాబ్స్ విస్తరణ

06-03-2026 12:01 AM

కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అమెరికా కాన్సుల్ జనరల్ హాజరు

హైదరాబాద్, మార్చి 5(విజయక్రాంతి): తక్కువ విద్యుత్ వినియోగ వైర్‌లెస్ సాంకేతికతలో అగ్రగామిగా నిలిచిన సిలికాన్ ల్యాబ్స్ (నాస్డాక్: ఎస్‌ఎల్‌ఏబీ) తన హైదరాబాద్ కేం ద్రాన్ని విస్తరించినట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి హైదరాబాద్‌లోని అమెరికా కాన్సు ల్ జనరల్ లారా ఈ. విలియమ్స్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ విస్తరణతో సంస్థ ప్రస్తుత కార్యాలయ విస్తీర్ణం సుమారు 50 శాతం పెరిగింది. ఈ కార్యక్రమంలో అమెరికా కాన్సుల్ జనరల్ పాల్గొనడం ద్వారా సాంకేతిక ఆవిష్కరణల పురోగతిలో అమెరికా- భారత్ ఆర్థిక సంబంధాల బలోపేతానికి ఉన్న ప్రాధా న్యం స్పష్టమైంది.హైదరాబాద్ మా గ్లోబల్ ఇంజినీరింగ్, ఆపరేషన్స్ నెట్‌వర్క్‌లో కీలక కేంద్రంగా మారిందని సిలికాన్ ల్యాబ్స్ అధ్యక్షుడు, సీఈఓ మ్యాట్ జాన్సన్ తెలిపారు. ఈ విస్తరణ ప్రతిభ, ఆవిష్కరణ, గ్లోబల్ సహకారంపై దీర్ఘకాలిక పెట్టుబడి.

ఇది ప్రపంచ వ్యా ప్తంగా ఉన్న కస్టమర్లకు భద్రతతో కూడిన, శక్తి సామర్థ్య వైర్‌లెస్ పరిష్కారాలను అందించే మా సామర్థ్యాన్ని పెంపొందించడమే కాకు ం డా, అమెరికా, యూరప్, ఆసియా దేశాల్లోని మా బృందాల మధ్య సహకారాన్ని బలోపే తం చేస్తుంది. కార్యక్రమంలో సిలికాన్ ల్యాబ్స్ ప్రతినిధులుగా సీఈఓ మ్యాట్ జాన్సన్, సీఎఫ్‌ఓ డీన్ బట్లర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మనీష్ కొఠారి,చీఫ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ రాధిక చెన్నకేశవుల, చీఫ్ లీగల్ ఆఫీసర్,    నెస్టర్ హో తదితరులు హాజరయ్యారు.