19-02-2026 05:31:10 PM
ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి
నిర్మల్,(విజయక్రాంతి): హిందూ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి జయంతి సందర్భంగా సారంగాపూర్ మండలం మలక్ చించొలి గ్రామంలో నూతనంగా ఏర్పాటు చేసిన శివాజీ మహారాజ్ విగ్రహాన్ని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి(BJP leader MLA Alleti Maheshwar Reddy) ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ సనాతన ధర్మం (హైందవ ధర్మ రక్షణకు) శివాజీ మహారాజ్ చేసిన సేవ చిరస్మరణీయం అన్నారు.
మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించిన హిందూ ధర్మ రక్షకుడు ఛత్రపతి శివాజీ మహారాజ్ ను స్పూర్తిగా తీసుకొని నేటి యువత ముందుకు సాగాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రావుల రాంనాథ్, ముత్యం రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు సత్యం చంద్రకాంత్, మండల అధ్యక్షులు నరేష్, నాయకులు అంబటి గంగాధర్, మాజీ ఎంపీటీసీ కొరిపెల్లి రాజేశ్వర్ రెడ్డి, తో పాటు మండల బీజేపీ సీనియర్ నాయకులు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.