22 August, 2026 | 10:50 PM

మహాదేవుని గడ్డ తండాకు అండగా నిలిచిన హైకోర్టు న్యాయవాది

22-08-2026 09:49 PM

తండావాసుల తాగునీటి సమస్యకు పరిష్కారం

నాగిరెడ్డిపేట,(విజయక్రాంతి): మండలంలోని మెల్లకుంటతండా గ్రామపంచాయతీ పరిధిలోని మహాదేవుని గడ్డ కాలనీలో నీటి ఎద్దడి నివారణకు ప్రముఖ హైకోర్టు న్యాయవాది మోయిన్ అహెమద్ ఖాద్రి  సహకారంతో శనివారం బోరు వేశారు. బోరులో పుష్కలంగా నీరు పడటంతో తండావాసులు హర్షం వ్యక్తం చేశారు. అనంతరం బోరు మోటారును ప్రారంభించారు. నాగిరెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో నెలకొన్న నీటి ఎద్దడి సమస్య గురించి స్థానిక మాజీ జెడ్పీటీసీ ఉమ్మన్నగారి మనోహర్ రెడ్డి న్యాయవాది మోయిన్ అహెమద్ ఖాద్రి దృష్టికి తీసుకెళ్లారు.

నీటి సమస్య ఉన్న తండాల్లో బోర్లు వేయించి ప్రజలకు సహాయం చేయాలని కోరారు.దీనిపై స్పందించిన న్యాయవాది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మహాదేవుని గడ్డ కాలనీలో బోరు వేయించారని మాజీ జెడ్పిటిసి ఉమన్నగారి మనోహర్ రెడ్డి తెలిపారు.బోరులో నీరు సమృద్ధిగా లభించడంతో తండావాసులు ఆనందం వ్యక్తం చేస్తూ న్యాయవాది మోయిన్ అహెమద్ ఖాద్రికి కృతజ్ఞతలు తెలిపారు.

ఈ సందర్భంగా నాగిరెడ్డిపేట్ మండల మాజీ జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి,గ్రామ సర్పంచ్ బాల్య నాయక్ తదితరులు న్యాయవాదిని సన్మానించారు.ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ మనోహర్ రెడ్డి, సర్పంచ్ బాల్యనాయక్, మహ్మద్ కాశీఫ్ మోయిన్, ఉప సర్పంచ్ రామావత్ వాసురం,కొర్ర గోవింద్,కొర్ర రాంజీ, అంగోత్ రమేష్, రామావత్ పీర్య, పాలకవర్గ సభ్యులు,తండావాసులు తదితరులు పాల్గొన్నారు.