calender_icon.png 4 December, 2025 | 2:20 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఐఏఎస్ రోనాల్డ్ రోస్‌కు షాక్

04-12-2025 12:21:50 AM

తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే 

హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): ఐఏఎస్ అధికారి రోనాల్డ్ రోస్‌కు హైకోర్టు షాకిచ్చింది. తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. రోనాల్డ్ రోస్‌ను ఏపీకి కేటాయిస్తూ గతేడాది అక్టోబర్ డీవోపీటీ ఉత్తర్వులు జారీ చేసింది. డీవోపీటీ ఉత్తర్వులను రోనాల్డ్ రోస్ క్యాట్ లో సవాల్ చేయగా.. స్థానికత ఆధారంగా ఆయనను తెలంగాణకు కేటాయిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులను డీవోపీటీ మళ్లీ హైకోర్టులో సవాల్ చేసింది. దీంతో క్యాట్ ఉత్తర్వులను నిలిపివేస్తూ బుధవారం హైకోర్టు మధ్యం తర ఉత్తర్వులు జారీ చేసింది.