04-12-2025 12:20:39 AM
భద్రాద్రి కొత్తగూడెం, డిసెంబర్ 3 (విజయక్రాంతి): భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేం ద్రంలోని భద్రాచలం రోడ్స్ రైల్వేస్టేషన్‌లో బుధవారం బాంబు కలకలం చెలరేగింది. మూడవ పట్టణ స్టేషన్ పరిధిలో గల రైల్వేస్టేషన్‌లో పట్టాలపై ఉన్న నాటు బాంబును వీధి కుక్క కొరకడంతో పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఆ మూగ ప్రాణి అక్క డికక్కడే మృతి చెందడం, ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేసింది.
విషయం తెలుసుకున్న పోలీసు బలగాలు జాగిలాలతో ఆ ప్రాంతానికి చేరుకొని విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. రైల్వే స్టేషన్‌లోకి బాంబు ఎలా వచ్చింది, ఎవరు తీసుకొచ్చా రు అనే కోణం నుంచి పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటనపై ఎస్పీ రోహిత్ రాజ్ స్పందించి అటవీ జంతువుల కోసం గుర్తుతెలియని వ్యక్తులు నాటు బాంబులను తయా రు చేశారని.
చెత్త పడవేసే ప్రాంతం నుంచి శునకం రైల్వే ట్రాక్ పైకి తినే ఆహారంగా భావించి కొరకటంతో ఈ ప్రమా దం సంభవించింది అన్నారు. ఈ ఘటనపై విచారణ కొనసాగిస్తున్నామని ప్రజలు ఎలాంటి భయాందోళన గురి కావలసిన అవసరం లేదని తెలిపారు. సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయవద్దని ఎస్పీ సూచించారు.