04-12-2025 12:23:27 AM
హైదరాబాద్, డిసెంబర్ 3 (విజయక్రాంతి): తెలంగాణలో గురువారం వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని, శుక్రవారం నుంచి రాష్ట్రంలో కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని తెలిపింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంది.