calender_icon.png 9 September, 2025 | 10:35 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అనాథ విద్యార్థి గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్‌కు ‘స్ఫూర్తి’ పురస్కారం

08-09-2025 12:00:00 AM

ఎల్బీనగర్, సెప్టెంబర్ 7 : ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహం అధ్య క్షుడు మార్గం రాజేశ్  స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు. తెలంగాణలోని భారత్  వికాస్  పరిషత్ ఆధ్వర్యంలో  కోఠిలోని యంగ్ మెన్స్ ఇంప్రూవ్మెంట్ లైబ్రరీలో   ప్రాంతీయ గురువందన చాత్ర అభినందన  కార్యక్రమాన్ని నిర్వహిం చారు. ఈ సందర్భంగా  తెలంగాణ రాష్ట్రoలో  సాహిత్యం,  కళలు, విద్యా,  సామాజిక సేవాతోపాటు వివిధ రంగా ల్లో   కృషి చేసిన ప్రముఖులను సన్మా నించారు.

ఈ కార్యక్రమానికి కేశవ్ మెమోరియల్  ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యదర్శి  డాక్టర్ అన్నదానం సుబ్ర హ్మణ్యం ముఖ్యఅతిథిగా హాజర య్యారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ లోని అనాథ విద్యార్థి గృహ విద్యార్థు లకు 33 సంవత్సరాల నుంచి సేవలు అందిస్తున్న గృహం అధ్యక్షుడు మార్గం రాజేశ్  ను ‘స్ఫూర్తి  పురస్కారం  -- 2025‘ అందజేసి సన్మానించారు. 

ఈ సందర్భంగా సభాధ్యక్షుడు జీవీసీఏ కన్వీనర్ చౌడూరి  నర్సింహారావు  మాట్లాడుతూ...  ఎల్బీనగర్ లోని  అనాథ విద్యార్థి గృహాన్ని  ప్రత్యక్షంగా   చూశామని, రెండు తెలుగు  రాష్ట్రాల  అనాథ విద్యార్థులకు   మార్గం రాజేశ్  అందిస్తున్న సేవలు అమోఘమన్నారు.

తండ్రిగా, అన్నగా  అన్ని బాధ్యతలను తన భుజాన వేసుకుని అనాథ విద్యార్థులకు అన్ని సౌకర్యాలు  కల్పించి, వారి  అభివృద్ధికి నిస్వార్థంగా, స్వచ్ఛందంగా సేవలు చేస్తున్న మార్గం రాజేశ్ ను స్ఫూర్తి పురస్కారానికి ఎంపిక చేశామని  ప్రకటించారు. కార్యక్రమంలో తెలంగాణ ప్రాంత  అధ్యక్షుడు  నాగ శేఖర్ గుప్తా, కార్యదర్శి  శివరామకృష్ణ,  సంస్కార్ వేదిక కన్వీనర్  నర్సింహాచార్యులు, భార త్  వికాస్  పరిషత్ దక్షిణ భారత అధ్యక్షుడు  ప్రసాద్, ఎల్బీనగర్ కార్య దర్శి  శివకుమార్  పాల్గొన్నారు.