22 May, 2026 | 7:13 PM

ఫ్రైడేను డ్రై డేగా పాటించాలి

22-05-2026 06:23 PM

దోమల నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించిన ... డిప్యూటీ కమిషనర్ శైలజ

మేడిపల్లి,(విజయక్రాంతి):  ప్రజా పాలన – ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా నిర్వహిస్తున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో ఈరోజు మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్, బోడుప్పల్ సర్కిల్ పరిధిలో  ఫ్రైడే ను డ్రై డే గా పాటించాలని, ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా డిప్యూటీ కమిషనర్ ఎ. శైలజ, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జాహ్నవి శశాంక్ తో కలిసి కాలనీలను సందర్శించి, దోమల నివారణ చర్యలపై ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఇళ్ల పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూడాలని, కొబ్బరి చిప్పలు, టైర్లు, పాత డబ్బాలు వంటి వాటిలో నీరు నిల్వ ఉండకుండా శుభ్రత పాటించాలని ప్రజలకు సూచించారు.  ప్రతి శుక్రవారం “డ్రై డే” పాటించడం ద్వారా దోమల వ్యాప్తిని నివారించవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఇంజనీర్  మహేష్, కాలనీ ప్రజలు, ఎంటమాలజీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.